భాష ఏదైనా కూడా ఈమద్య కాలంలో ఆయన పాట పాడితే చాలు వ్యూస్ లక్షల్లో వస్తున్నాయి. సంగీత దర్శకుడు ఎవరైనా కూడా ఆయన కనుక పాటను పాడితే ఖచ్చితంగా అదో భారీ హిట్ సాంగ్ గా మారిపోతుందట.

పెద్ద ఎత్తున పాటలు పాడుతున్న సిద్ శ్రీరామ్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం తెగ చర్చ జరుగుతోంది. సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకు గాను ఆరు నుండి ఎనిమిది లక్షల పారితోషికంను అందుకుంటాడనే వార్తలు కూడా వస్తున్నాయి.


సిద్ శ్రీరామ్ పాటపాడితే కచ్చితంగా ఆడియోన్స్ దానిని మెచ్చి తీరాల్సిందే.వారు పదే పదే వినాల్సిందే. మరోవైపు ఆయనతో పాట పాడిస్తేనే ఆ సినిమా కూడా హిట్ అవుతుందనే టాక్ కూడా బాగా నడుస్తోంది. ఈ క్రమంలో సిద్ తో పాటలు పాడించేందుకు నిర్మాతలు తెగ ముందుకు వస్తున్నారు. ఎంత ఖర్చైనా సరే సిద్ శ్రీరామ్ పాట పాడించాల్సిందేనని అంటున్నారు.

అయితే ప్రస్తుతానికి మాత్రం అతడి గాత్రంలోనే ఏదో మ్యాజిక్‌ ఉందంటున్నారట.అతడు పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకులను టాక్సీవాలా’లో 'మాటే వినదుగా..', అల వైకుంఠపురములో’ 'సామజవరగమన', 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? లో 'నీలి నీలి ఆకాశం..', నల్లమలలోని 'యేమున్నవే పిల్లా', వకీల్‌ సాబ్‌లో 'మగువా మగువా'.. రాహూలో 'ఏమో ఏమో' మొన్నటి 'పుష్ప'లోనూ 'శ్రీవల్లి', బంగార్రాజులోని 'నా కోసం' పాట పాడి తన క్రేజ్ ను ఇంకాస్త పెంచుకున్నాడు. అంతేగాక ఆ సినిమాలన్నీ విజయం సాధించడం అతడికి ఎంతగానో కలిసొచ్చింది.

భాష రాకున్నా కూడా సిద్ చాలా ఈజీగా పాడేస్తాడు. ఎలాంటి సంగీత దర్శకుడు మరియు సినిమా దర్శకుడు అయినా కోరిన విధంగా పాటను పాడగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు లో సిద్ శ్రీరామ్ కు అభిమానులు పెద్ద ఎత్తున పెరిగారు.దాంతో థమన్ మరియు దేవి శ్రీ ప్రసాద్ వంటి స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ ఒక సినిమా ఆల్బంలో కనీసం ఒక్క పాటను అయినా పాడించేందుకు గాను ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.

ఒకటి రెండు పాటలు సిద్ తో పాడించడం వల్ల ఆ ఆల్బం సూపర్ హిట్ అవుతుంది. కనుక సంగీత దర్శకులు ఛాన్స్ తీసుకోకుండా ప్రయోగాలు చేయకుండా హీరోలు కోరినట్లుగా సిద్ తో పాడించేందుకు వారు సిద్దం అవుతున్నారట. రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు తీసుకుంటున్నాడట! నిజానికి సింగర్స్‌కు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ ఉండే అవకాశం లేదని కానీ సిద్ శ్రీరామ్ స్మాల్ సెలెబ్రెటీల మారిపోవడం తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకోవడం మూలంగా తాను పాడిన ప్రతి పాట ఎంతో హిట్ గా నిలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: