యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే, అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ నటించిన సినిమా రాదే శ్యామ్,  ఈ సినిమాకు జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్రబృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు  కలిగి ఉన్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం  జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది, కాకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది.

  అయితే ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు, అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది,  రాదే శ్యామ్ చిత్ర బృందం ఈ సినిమాను ఓటిటి లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, అలాగే ఈ సినిమాకు కొన్ని ప్రముఖ ఓటిటి సంస్థల నుండి భారీ మొత్తంలో ఆఫర్ లు కూడా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి, ఇదిలా ఉంటే ఈ సినిమాకు నెట్ ఫ్లెక్స్ జీ ఫైవ్ ఓటిటి సంస్థల నుండి భారీ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి, ఈ రెండు ఓటిటి సంస్థల లో ఏదో ఒక దానిలో రాదే శ్యామ్ సినిమా స్ట్రీమ్మింగ్ కాబోయే అవకాశాలు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది, మరి ఈ సినిమా విడుదల అవుతుందా లేక థియేటర్లలో విడుదల అవుతుందా తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ సినిమా కనుక ఓటిటి లో విడుదల అయితే ఎప్పటినుండో ఈ సినిమాను వెండితెరపై చూద్దాము అనుకున్న ప్రభాస్ అభిమానులకు నిరుత్సాహమే మిగులుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: