ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత ట్రెండ్ నడుస్తోంది... విడాకుల అనంతరం సామ్ కి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తనకు నచ్చిన రోల్స్ ని మాత్రమే ఎంచుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ సామ్ కి బాగా కలిసొచ్చింది. 'ఉ అంటావా మావా ఉ ఊ అంటావా మావా అంటూ యువతను పరుగులు పెట్టించిన సమంతకు ఆఫర్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరో తన సినిమాకి సమంత మాత్రమే హీరోయిన్ గా కావాలని పట్టు బట్టారట. ఇంకే హీరోయిన్ పేరు చెప్పినా వద్దంటూ కాస్త లేట్ అయినా సామ్ డేట్స్ తీసుకుని ఫిక్స్ అవ్వమంటున్నారట.

ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సమంత కోసం అంతలా ఎగబడుతున్న ఆ హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా? అతనెవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తి. యంగ్ డైరెక్టర్ సతీష్ సెల్వ కుమార్ తో ఓ సినిమా చేయనున్న కార్తి ఆ చిత్రంలో హీరోయిన్ గా సామ్ ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సమంతతో సంప్రదింపులు కూడా జరిగాయని ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కార్తి కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ ఉంది. ఈ హీరో తమిళ చిత్రాలు తెలుగు లోను మంచి ఆదరణ పొందుతుంటాయి . కాగా ఈ కొత్త సినిమా కూడా తెలుగులో రానుంది.

సమంత నటించిన శాకుంతలం  సినిమా... విడుదలకు రెడీగా ఉండగా, యశోద సినిమా కూడా దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత కార్తీ తో సినిమా చేస్తుందా లేక ఎప్పుడు సినిమా పట్టాలెక్కుతోంది అన్న పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: