‘భీమ్లా నాయక్’ సూపర్ హిట్ తరువాత ఇండస్ట్రీలో పవన్ మ్యానియా మరింత పెరిగిపోయింది. వాస్తవానికి ఈమూవీ తరువాత పవన్ ‘హరిహర వీర మల్లు’ షూటింగ్ లో పాల్గొని ఆమూవీని పూర్తి చేస్తాడు అని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే ఈ అంచనాలకు భిన్నంగా పవన్ సముద్రఖని దర్శకత్వంలో నటించబోయే మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.


ఒక తమిళ సినిమాకు రీమేక్ గా నిర్మాణం జరుపుకోబోయే ఈమూవీలో సాయి ధరమ్ తేజ్ కూడ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. పవన్ అభిమానులకు నచ్చే విధంగా ఈమూవీ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేస్తున్నట్లు టాక్. అయితే ఈసినిమాలో పవన్ కు ఈమూవీ నిర్మాతలు ఇస్తున్న పారితోషికానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు టాప్ హీరోలకు కూడ షాక్ ఇస్తున్నాయి.


ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీలో నటించేందుకు కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే పవన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈమూవీ నిర్మాతలు పవన్ 50 కోట్ల పారితోషికం ఇస్తున్నారు అంటూ జరుగుతున్న ప్రచారం చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈవార్తలే నిజం అయితే పవన్ కు రోజుకు 2.5 కోట్లు పారితోషికంగా అందుతున్నట్లు అనుకోవాలి.


ఇప్పటి వరకు పవన్ కు ఈ రేంజ్ లో పారితోషికం ఆఫర్ చేసిన నిర్మాతలు లేరు అని అంటున్నారు. వాస్తవానికి పవన్ తన సినిమా కెరియర్ ను ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు దాటిపోయినా పవన్ ఇప్పటి వరకు కేవలం 27 సినిమాలు మాత్రమే చేసాడు. అందులో అనేక సూపర్ ఫ్లాప్ లు కూడ ఉన్నాయి. సినిమాలు వదులుకుని రాజకీయాల బాట పట్టి అక్కడ కలిసి రాకపోవడంతో మళ్ళీ యూటర్న్ తీసుకుని సినిమాలు చేస్తున్న పవన్ కు నిర్మాతలు ఆఫర్ చేస్తున్న పారితోషికాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ మ్యానియా అభిమానులలో మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఏ స్థాయిలో వెలిగిపోతోందో అర్థం అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: