రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ తీసిన లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఎంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్, లవ్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. దీనితో పాటు కేజేఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా అలానే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్, మహానటి మూవీ ఫేమ్ నాగ అశ్విన్ తో ప్రాజక్ట్ కె అనే భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.

అలానే మరోవైపు యువ సక్సెసఫుల్ దర్శకుడు మారుతీ తో కూడా ప్రభాస్ ఒక స్టోరీ ఒకే చేసినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే వీటిలో సలార్, ప్రాజక్ట్ కె వేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఆదిపురుష్ ఇటీవల షూట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మారుతీ సినిమాని ఏప్రిల్ మొదటి వారంలో అనౌన్స్ చేయనుండగా దానిని మే లో పట్టాలెక్కించనున్నారట.

అయితే విషయం ఏమిటంటే, గత కొద్దిరోజులుగా రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటున్న ప్రభాస్, తన ఫ్యాన్స్ కి ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపైన తన నుండి ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటానని, బాహుబలి, సాహో, రాధేశ్యామ్ తరువాత ఇకపై తన సినిమాల షూట్స్ వేగంగా పూర్తి చేసి తప్పకుండా రెండు మూవీస్ రిలీజ్ చేస్తానని, అలానే అన్ని వర్గాల ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని పక్కాగా ఏ సినిమాకి ఆ సినిమా ఎంతో వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు ప్రభాస్. మరి ఇదే కనుక అమలైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: