‘బాహుబలి’ మూవీతో టాలీవుడ్ సినిమా మార్కెట్ పెరిగిపోయి పాన్ ఇండియా సినిమాల స్థాయికి ఎదిగిపోయింది. తెలుగుసినిమాల బిజినెస్ పెరిగిపోయి వందల కోట్ల స్థాయిలో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో స్టార్ హీరోలు తమ రెమ్యూనిరేషన్ భారీగా పెంచేశారు. రాజమౌళి లాభాల వాటాల రూపంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా కొంతమంది స్టార్ డైరెక్టర్ లు 15 నుంచి 25 కోట్ల వరకు తీసుకుంటున్నారు.  


ఇండస్ట్రీలో  రాజమౌళి తరువాత స్థానంలో ఉన్న త్రివిక్రమ్ ఒకొక్క చిత్రానికి 20 నుంచి 25 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు అన్నవార్తలు ఇప్పటికే ఉన్నాయి. అయితే త్రివిక్రమ్ ఇప్పుడు ఈ రేంజ్ ని దాటి 50 కోట్ల స్థాయికి చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా విడుదల అయిన ‘భీమ్లా నాయక్’ చిత్రానికి మాటలు స్క్రీన్ ప్లే తో పాటు అన్నీతానై నడిపించిన త్రివిక్రమ్ లేటెస్ట్ గా మహేష్ తో ఒక సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 11ఏళ్ల విరామం తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి చేయబోతున్న ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈమూవీని నిర్మిస్తున్నారు.  ఇప్పుడు ఈచిత్రానికి మహేష్ త్రివిక్రమ్ లు అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నుంచి మహేష్ తన పారితోషికాన్ని 50 కోట్లకు పెంచేశాడు. ఇప్పుడు అదే స్థాయిలో త్రివిక్రమ్ కూడ తన పారితోషికాన్ని 50 కోట్ల రేంజ్ కి పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఒక్కో చిత్రానికి 25 కోట్లు మాత్రమే తీసుకుంటూ వస్తున్న త్రివిక్రమ్ తాజాగా మహేష్ మూవీకి దాన్ని డబుల్ చేసి 50 కోట్లు డిమాండ్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. మహేష్ త్రివిక్రమ్మూవీ ‘అతడు’ ‘ఖలేజా’ తరువాత వస్తున్న హ్యాట్రిక్  మూవీ కావడంతో ఈమూవీ పై భారీంచనాలు ఉన్నాయి.   దీనితో ఆ రేంజ్ కి తగ్గట్టుగా 50 కోట్ల రెమ్యూని రేషన్ స్థాయికి  త్రివిక్రమ్ చేరుకున్నాడు అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: