ఈవారం విడుదల కాబోతున్న ‘రాథే శ్యామ్ మ్యానియాలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. ఈ సినిమా విడుదలైన రెండు వారాల గ్యాప్ తో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాబోతోంది. ఈ రెండు భారీ సినిమాలలో ఏ సినిమా విజేతగా నిలిచి ఇండస్ట్రీలో సంచలనాలు క్రియేట్ చేస్తుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈవిషయాలు ఏమి పట్టించుకోకుండా రాజ్ తరుణ్ తన లేటెస్ట్ మూవీ ‘స్టాండ్ అప్ రాహుల్’ మూవీని ఈ పెద్ద సినిమాల హడావిడి మధ్య మార్చి 18న విడుదల చేయడం చూసిన వారు అసలు రాజ్ తరుణ్ కు ఏమైంది అంటూ ఆశ్చర్యపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో రాజ్ తరుణ్ ఇలాంటి సాహసం చేస్తున్నాడా అంటూ మరికొందరు ఆశ్చర్య పడుతున్నారు.
గతంలో భారీ సినిమాల మధ్య విడుదలైన కొన్ని చిన్న సినిమాలు ఊహించని సక్సస్ సాధించిన ట్రాక్ ఉంది. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ ను నమ్ముకుని రాజ్ తరుణ్ ఇలాంటి సాహసం చేస్తున్నాడా అని కామెంట్స్ చేస్తున్నవారు కూడ ఉన్నారు. అయితే ఇండస్ట్రీని శాసించే రెండు భారీ సినిమాల మధ్య ఈ చిన్న సినిమాకు ఎక్కడ ధియేటర్లు దొరుకుతాయి అన్న సందేహం కూడ ఉంది. వర్షా బోలమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి శ్యామ్ తో అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి