ఇటీవలి కాలంలో సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా.. డైరెక్టర్ ఎవరైనా సరే ఇక ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే చాలు ఆ సినిమాపై నెగిటివ్ టాక్ ని ప్రచారం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలా నెగిటివ్ టాక్ ప్రచారం చేసేవారి బ్యాచ్ ఈమధ్య కాలంలో కాస్త ఎక్కువ అయిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  మొదటి రోజు నుంచే ఇలా నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల ఇక సినిమాలకు ఎన్నో కోట్ల నష్టం వాటిళ్ళుతుంది.ఇక చిన్న హీరోల సినిమాలు అయితే పూర్తిగా నెగటివ్ టాక్ తో ఫ్లాప్ అయిపోతున్న పరిస్థితి వస్తుంది.



 ఇకపోతే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ సూపర్ హిట్.. ఇక సినిమా రికార్డులు తిరగరాయడం పక్క అంటూ ఎన్నో కామెంట్లు పెడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం సినిమా అసలు బాగాలేదు అంటూ నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో కొంతమంది అభిమానులు షాక్ లో మునిగి పోతున్నారు అని చెప్పాలి. ఇక నెగిటివ్ టాక్ ఇబ్బందులు చిన్న హీరోలకు మాత్రమే కాదు త్రిబుల్ ఆర్ సినిమా కి కూడా తప్పలేదు అని తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై ఇటీవలే వైసీపీ నేతలు వ్యాపారవేత్త ప్రసాద్ వి.పొట్లూరి మండిపడ్డారు.


 జీవితంలో ఒక సీన్ తీయలేదు షూటింగ్లో నిలబడింది కూడా లేదు. కానీ సినిమాలు తీయడంలో క్లాసులు పీకుతారు. కళకి కులం పెట్టి అంటించే కొడుకులను కుత్తుక కోయాలి.. జాతి గర్వించే కథలు దేశభక్తితో రక్తం ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి. మన తెలుగువాడు జాతీయ సంపద అయినందుకు మన మందరం కూడా ఎంతగానో సంతోషపడాలి అంటూ వైసీపీ నేత ప్రముఖ వ్యాపారవేత్త అయిన పివిపి ఇక నెగటివ్ రివ్యూ ఇచ్చే వాళ్లపై మండిపడ్డారు అని చెప్పాలి. అయితే అటు త్రిబుల్ ఆర్ సినిమా పై నెగిటివ్ రివ్యూలు చూసిన తర్వాత అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr