లేటెస్ట్ గా తాప్సీ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ ఫంక్షన్ లో చిరంజీవి తన మాటలతో తాప్సీని ఒక ఆట ఆడుకున్నాడు. తాప్సీ గతంలో నటించిన ‘ఝుమ్మంది నాదం’ మూవీ చూసినప్పుడు అప్పట్లో తాను అలాంటి గ్లామర్ బ్యూటీతో ఎందుకు రోమాన్స్ చేయలేకపోయాను అన్న ఫీలింగ్ వచ్చిందని అయితే అప్పట్లో తాను రాజకీయాలలో కొనసాగుతున్న పరిస్థితులలో తాప్సీ లాంటి బ్యూటీలతో నటించే అదృష్టం తనకు దక్కలేదు అంటూ జోక్ చేసాడు.
ఇదే సందర్భంలో తాప్సీ పై మరిన్ని ప్రశంసలు కురిపిస్తూ తనకు ఇప్పటికీ తాప్సీ తో నటించాలని ఉందని అంటూ అయితే దానికి ఒక కండిషన్ ఉంది అంటూ మరొక జోక్ పేల్చాడు. తనతో నటించేడప్పుడు తాప్సీ తనను డామినేట్ చేయకూడదని ఆ కండిషన్ ను అంగీకరిస్తే తాను తాప్సీ తో నటించడానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చాడు. అయితే చిరంజీవి మాటలను విన్న తాప్సీ నవ్వి ఊరుకుంది కానీ తాను మెగా స్టార్ ను డామినేట్ చేయకుండా నటిస్తాను అని మాత్రం ఓపెన్ గా చెప్పలేదు.
హీరోయిన్స్ కు హీరోలతో సమానంగా పారితోషికాలు ఎందుకు ఇవ్వరు అంటూ అనేక సందర్భాలలో తాప్సీ కామెంట్ చేసి అనేక వివాదాలకు చిరునామాగా మారింది. అంతేకాదు హీరోయిన్స్ ను గ్లామర్ డాలస్ గా చూపెడుతూ చాలామంది హీరోయిన్స్ కు నటించే అవకాశం లేకుండా చేస్తున్నారు అంటూ అనేక సందర్భాలలో తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి చిరంజీవి నటించే ప్రతి సినిమాకు కోట్లాది రూపాయలలో పారితోషికం తీసుకుంటున్న పరిస్థితులలో ఆ స్థాయిలో పారితోషికం ఇచ్చి ఎవరు ఆమెను బుక్ చేసుకుంటారు అన్నదే అర్థం కాని విషయం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి