అంతేకాదు యూరప్ లోని తన స్నేహితులను అదేవిధంగా బంధువులను పిలిచి ఒక గ్రాండ్ పార్టీ కూడ ఇచ్చాడు. యూరప్ నుండి తిరిగి వచ్చిన తరువాత బన్నీ భార్య స్నేహా రెడ్డి పుట్టినరోజు వేడుకల ఫోటోలను తన ఇన్ ష్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు షేర్ అయిన కొద్ది గంటలకే అవి వైరల్ గా మారాయి.
అయితే ఆ ఫోటోలలో బన్నీ పక్కన సన్నిహితంగా ఉంగరాల జుట్టుతో చాల గ్లామర్ గా కనిపించిన ఒక అమ్మాయి ఫోటో కూడ ఉంది. బన్నీ పక్కన ఆబ్యూటీ ఎవరు అంటు విపరీతంగా సోషల్ మీడియాలో పరిశోదన జరిగింది. ఆ అమ్మాయి పేరు వాసుకి పుంజ్ టాప్ హీరోయిన్స్ కు మించి అందాల ఆరబోతలో పేరు గాంచిన టాప్ మోడల్ ఈ వాసుకి పుంజ్.
దీనితో ఈ గ్ల్మార్ బ్యూటీకి బన్నీ అవకాశాలు ఇప్పిస్తున్నాడా అంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. మరి కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి ఈమెకు బన్నీ ‘పుష్ప 2’ లో అవకాశం కల్పిస్తున్నాడు అంటూ మరొక ఊహాగానానికి తెర తీసారు. ‘పుష్ప 2’ లో అల్లు అర్జున్ చాల స్టైలిస్ట్ గా కనిపించే పరిస్థితులలో ఈ మూవీలో బన్నీ గెటప్ కోసం అనేకమంది ప్రముఖ స్టైలిస్ట్ లతో ప్రస్తుతం సుకుమార్ చర్చలు జరుపుతూ బన్నీని చాల అందంగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ‘పుష్ప 2’ షూటింగ్ చాలభాగం విదేశాలలో జరిగే విధంగా ఆమూవీ కథ ఉందని సమాచారం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి