సక్సెస్ కొట్టడం అనేది ఈ రోజుల్లో పెద్ద విషయం ఏమీ కాదు కానీ ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడమే ఇక్కడ అసలు విషయం. చాలా మంది హీరోలు హిట్ కొట్టడం తో తమ పని అయిపోయింది అనుకొని ఇప్పటివరకు ఎన్నో తప్పులు చేశారు ఆ తరువాత ఆ తప్పులు వారి కెరియర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి అందరికీ తెలిసిందే. హిట్ కొట్టడం అనేది పెద్ద విషయం కాదు దాన్ని కంటిన్యూ చేయడమే పెద్ద గొప్ప విషయం అని ఇప్పుడు అందరు హీరోలకు తెలిసి వస్తుంది.

అందుకే ప్రతి సినిమా విషయంలో కూడా మన హీరోలు ప్రేక్షకులను అలరించే విధంగా కథలను ఎంచుకుని వాటి ద్వారా పెద్ద విజయాన్ని అందుకుంటున్నారు. ప్రభాస్ ఈ విషయంలో ఎంతో జాగ్రత్త అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ఆయన సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడు. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో ఉంది. బడ్జెట్ విషయం లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా ఆయన సినిమాలను చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన స్టామినాను ఏమాత్రం తగ్గించుకోకుండా సినిమాలను చేస్తూ ఇప్పుడు ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలను పరిశీలిస్తే అన్ని కూడా భారీ బడ్జెట్ సినిమాలే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సలార్ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా పూర్తి కాగా మిగిలిన భాగాన్ని తొందరలోనే పూర్తి చేసి ఈ ఏడాది చివర లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి అనేది చిత్ర యూనిట్ ఆలోచన. మరి ఈ ఏడాది రాధే శ్యామ్ తో ఫ్లాప్ అందుకున్న ఈ హీరో మరో సినిమా తో ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: