మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుండా చాలా సమస్యల్లో పడతావు అని బోల్డన్ని నీతి సూత్రాల్లో చెబుతుంటారు. మరి జాన్ అబ్రహం ఆ మాటలు విన్నాడో లేదో గానీ, తెలుగు సినిమా గురించి తక్కువగా మాట్లాడి పెద్ద పొరపాటు చేశాడు. ఆ ఫలితాన్ని ఇప్పుడు ఫేస్‌ చేస్తున్నాడు. నెటిజన్ల ట్రోలింగ్‌తో జాన్‌ అబ్రహం ఇమేజ్‌ మొత్తం డ్యామేజ్ అవుతోంది.

నెటిజన్లు జాన్‌ అబ్రహంని ఒక రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌ని, రీజనల్‌ సినిమాని తక్కువ అంచనా వేసి బోల్తాపడ్డావు.. అసలు నువ్వు ఒక బ్లాక్‌బస్టర్ హిట్‌ చూసి ఎన్నాళ్లు అయ్యింది.. 'బాహుబలి' రికార్డ్స్‌ని బ్రేక్‌  చేసేందుకు ఇప్పటికీ మీ వాళ్లు అష్టకష్టాలు పడుతున్నారు.. అయినా మీ ఇగో మాత్రం తగ్గలేదు.. కనీసం 'ఎటాక్' రిజల్ట్‌ చూసైనా తగ్గమని కామెంట్లు పెడుతున్నారు.

జాన్‌ అబ్రహంని 'అటాక్' సినిమా ప్రమోషన్స్‌లో నెక్ట్స్ తెలుగు సినిమా చేస్తున్నారట నిజమేనా అని అడిగారు ముంబయి రిపోర్టర్లు. దానికి తెలుగు సినిమా చేయను, అసలు రీజనల్‌ సినిమా వైపే వెళ్లను, హిందీ నుంచి అక్కడికి వెళ్లి సెకండ్‌ హీరోగా నటించాల్సిన అవసరం లేదు.. అయనా బాలీవుడ్‌ నుంచి డౌన్‌ సౌత్‌కి వెళ్లడమేంటి అన్నట్లు మాట్లాడాడు జాన్‌ అబ్రహం.

తెలుగు సినిమా 'ఆర్ ఆర్ ఆర్' రిలీజైన వారానికి ఏప్రిల్‌1న రిలీజ్ అయ్యింది 'ఎటాక్'. లక్ష్యరాజ్‌ ఆనంద్ దర్శకత్వంలో జాన్‌ అబ్రహం, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లీడ్‌ రోల్స్‌లో వచ్చిందీ సినిమా. అయితే ఈ సినిమాపై నెగటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. 'ఎటాక్‌'లో యాక్షన్‌ సీన్స్ తప్ప, ఎమోషన్స్‌ లేవని.. కేవలం కంటెంట్‌ లేకుండా జాన్‌ అబ్రహం కండంలతో సినిమా నడవదని కామెంట్స్‌ వచ్చాయి.

'ఎటాక్‌' సినిమాకి పూర్‌ రివ్యూస్‌ రావడం ఆలస్యం, థియేటర్ల నుంచి ఈ బొమ్మని తీసేస్తున్నారు. జాన్‌ అబ్రహం ఏదైతో తెలుగు సినిమా గురించి తక్కువగా మాట్లాడాడో, అదే తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లిన 'ఆర్ ఆర్ ఆర్'ని ప్రదర్శిస్తున్నారు. 'ఆర్ ఆర్ ఆర్'కి డిమాండ్‌ ఎక్కువగా ఉందని, 'ఎటాక్‌'ని పక్కనపెట్టి 'ఆర్ ఆర్ ఆర్' స్కీన్లు పెంచుకుంటున్నాయి థియేటర్ యాజమాన్యాలు.

'ఎటాక్' సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం, రోజు రోజుకి స్క్రీన్లు తగ్గిపోవడంతో నెటిజన్ల జాన్‌అబ్రహంపై నెటిజన్ల ఎటాక్‌ కూడా పెరిగిపోతోంది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అమితాబ్ బచ్చన్, సల్మాన్ కాన్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరోలు తెలుగులో నటిస్తున్నారు. వాళ్లెవరూ తెలుగు సినిమాని తక్కువ చేయలేదు. నువ్వు సరైన హిట్‌ కొట్టి ఎన్నాళ్లు అయ్యిందో నీకు అయినా గుర్తుందా, బాడీ పెంచడమే కాకుండా బుర్ర కూడా  వాడాలి అని ఘాటు విమర్శలు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: