టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన రామ్ పోతినేని గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద అందుకున్న రామ్ పోతినేని ఆ తర్వాత రెడ్ సినిమాలో నటించాడు.  ప్రస్తుతం రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే సారి విడుదల చేయబోతున్నారు.  ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాకపోతే ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే హరీష్ శంకర్ కూడా ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. అలాగే రామ్ పోతినేని కూడా ది వారియర్ సినిమాతో పాటు బోయపాటి శ్రీను సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ఇలా వీరిద్దరూ వీరి సినిమా లను పూర్తి చేసుకున్న తర్వాత రామ్ పోతినేని,  హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: