బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ చిత్రం తో పాన్ ఇండియా హీరోగా మారిన తారక్ పై అంచనాలు మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఆయన నుండి ఇకపై వచ్చే చిత్రాలన్నింటి పై ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి. అంతే కాకుండా ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ కూడా అభిమానులను తెగ ఊరిస్తున్నాయి. ఒకవైపు సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక ప్రాజెక్ట్ మరో వైపు తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన దర్శకుడు కొరటాల శివతో మరో ప్రాజెక్ట్ లకు ఇప్పటికే సైన్ చేసి అభిమానులకు తీపి కబురు అందించారు. అయితే వీటిలో ముందుగా తన 30 చిత్రం చేస్తున్నాడు.

డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో అని ఇప్పటికే అఫిషియల్ గా అనౌన్స్ చేశారు తారక్. అయితే ఈ సూపర్ హిట్ కాంబో లో రాబోతున్న సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ ఫై కి వెళుతుందా ఎప్పుడెప్పుడు తమ ముందుకు వస్తుందా అని ఆసక్తిగా ఉన్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఒక వార్త ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. తారక్ కు స్క్రిప్ట్ పై ఎంత పట్టుంది అన్న విషయం తెలిసిందే.  ఒక సాధారణ ప్రేక్షకుడు స్థానంలో ఉండి కథను విని అది ఎంత వరకు అందరికీ రీచ్ అవుతుంది అన్నది అంచనా వేయగల టాలెంట్ ఎన్టీఆర్ కు ఉంది. ఒకవేళ కథలో కొన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులకు అంతగా నచ్చవు అనిపించిన మార్పు చేర్పులు కావాలని మొహమాటం లేకుండా దర్శకులకు చెప్పేస్తారు ఈ యంగ్ హీరో.

అలాగే ఈ కథ లో  కూడా కొన్ని మార్పులు అవసరమని కొరటాలకు సూచించారని ప్రస్తుతం కొరటాల అదే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. ఇదిలా ఉండగా కథ ఎలా ఉండాలో మాత్రమే కాదు, కథ కోసం తాను ఎలా మారాలన్న కూడా ఎపుడు రెడీ గా ఉంటారు ఈ హీరో. తన ప్రతీ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపిస్తూ అభిమానుల్ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇపుడు ఈ సినిమాలో కూడా మరో కొత్త మేక్ ఓవర్ తో  కనిపించేందుకు కసరత్తులు చేస్తున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాలో కొత్త లుక్ కోసం ఏకంగా 10,11 కేజీలు తగ్గాలని కండలు కరిగిస్తున్నారట. ఈ సారి తారక్ అదిరిపోయే లుక్ తో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తారని అంటున్నారు.  

ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన వీడియో గ్లింప్స్‌ను కూడా వదిలారు. అయితే ఈ సినిమాని మొదట జూన్ లో స్టార్ట్ చేద్దామని అనుకున్న కథలో మార్పులు జరుగుతుండటంతో కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. అయినా 2023  సంక్రాంతికి ఈ చిత్రాన్ని బరిలోకి దింపాలని టీం అనుకుంటున్నారు. వన్స్ కథ ఫినిష్ అయ్యాక షూటింగ్ ఎంతసేపు అంటున్నారు. మరి ఈ చిత్రంలో తారక్ లుక్ ఎలా ఉండబోతున్నాడని తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: