డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ మారుమోగుతోంది. ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ప్రస్తుత దర్శకులలో అనిల్ రావిపూడి పనితనం బాగుందని చాలా మంది కూడా చెప్పుకొస్తున్నారు.

ఇక ఇదే సమయంలో మరో పక్క అందరితో కలిసి పోతూ.. తనదైన శైలిలో రాణిస్తున్న అనిల్ రావిపూడి rrr ప్రమోషన్ కార్యక్రమాల్లో అలాగే ఇంకా మరికొన్ని కార్యక్రమాలలో దర్శకుడి గా ఉంటూనే ఆ సినిమాలు విజయం సాధించడంలో.. తన వంతు కృషి కూడా చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో జంధ్యాల అనిల్ రావిపూడి అని కూడా అంటున్నారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రస్తుతం “ఎఫ్ త్రీ” సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మే 27వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుందట.ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న అనిల్ రావిపూడి… ఎన్టీఆర్ తో తాను సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ తో సినిమా లేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చిన వార్తలు మొత్తం కూడా రూమర్స్ మాత్రమే అని ఏదైనా సినిమా ఉంటే నేనే ప్రకటిస్తాను కూడా అని చెప్పుకొచ్చారు.

దీంతో నందమూరి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చినట్లు అయింది. అన్న కళ్యాణ్ రామ్ కి “పటాస్” సినిమా తో మంచి హిట్ అప్పట్లో ఇవ్వటంతో ఎన్టీఆర్ తో గ్యారెంటీగా సినిమా అవుతుందని కూడా భావించారు. కానీ లేదని తేల్చి చెప్పటంతో పాటు నందమూరి బాలయ్య సినిమా చాలా డిఫరెంట్ జోనర్ అని చెప్పడంతో కాస్త సంతోషంగా ఉన్నారట్స్.. అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తీయబోయే సినిమాలో బాలయ్య బాబు 50 సంవత్సరాలు ముసలి వ్యక్తి గా కనిపించనున్నట్లు సమాచారం. తనదైన కామెడీ టైమింగ్ తో… అనిల్ రావిపూడి బాలయ్య బాబు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: