అల్లు
అర్జున్ హీరోగా
సుకుమార్ దర్శకత్వంలో చేసి న మూడవ
సినిమా పుష్ప. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి సక్సెస్ను అందుకోగా ఇప్పుడు చేయబోయే ఈ మూడవ
సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవాల ని భావించి ఈ సినిమాను మొదలు పెట్టారు. అయితే ఈ
సినిమా వారు అను కున్న దానికంటే సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ సినిమాకు
బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
దాంతో ఈ
సినిమా యొక్క సీక్వెల్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇంకా ఈ సిని మా షూటింగ్ మొదలు పెట్టకపోవడం ఈ
సినిమా అభిమానులను అలాగే
బన్నీ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. తొందర్లోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ ప్రారంభించపోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అయితే అది ఎప్పుడూ అన్న క్లారిటీ మాత్రం ఇంకా ఇవ్వడం లేదు.
బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ
సినిమా యొక్క స్క్రిప్ట్ ను వారికి బాగా నచ్చే విధంగా తయారు చేయడమే ఈ విధంగా ఆలస్యం అవ్వడానికి కారణం అని తెలుస్తుంది.
ఏదేమైనా మరో రెండు నెలల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టాలని గట్టి పట్టుదల తో ఉంది యూనిట్. అయితే అభిమానులు మాత్రం ఈ
సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని భావించగా అది జరగడం కష్టమని ఇప్పటికే అందరికీ అర్థం అయి ఉంటుంది. మరి
సుకుమార్ ఎప్పుడు ఈ సినిమాను మొదలు పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడో చూడాలి. ప్రస్తుతం
అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలకు సంబంధించిన కథలను ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు త్వరలోనే ఈ
సినిమా షూటింగులో జాయిన్ కాను న్నాడు.