నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చాలా అరుదుగా సినిమాలు తెరకెక్కుతుంటాయి. కారణం ఈ తరహా కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించి హిట్ అందుకోవడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే లవ్ ట్రాక్ అయితే పెద్దగా గ్రిప్ లేకపోయినా ఏదోలా నెట్టుకొచ్చేయొచ్చు. కానీ ఇలా సెపరేట్ జోనర్ల జోలికి వెళ్ళాలంటే ఒకరకంగా పెద్ద ప్రయోగమే. అందుకే రిస్క్ చేయాలని అనుకోరు. అందులోనూ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో కథ అంటే ఇంకా రిస్క్. అయితే ఈ తరహా కథతో వచ్చి హిట్స్ అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. కానీ నక్సలిజం లైన్ పై సినిమాను తెరకెక్కించడం ఆషామాషీ విషయం కాదు. కేవలం కొంతమంది డైరెక్టర్స్ మాత్రమే ఈ తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ధైర్యం చేస్తుంటారు. అలా ఈ నేపథ్యం లో వచ్చిన రెండు మూడు చిత్రాలు సంచలన విజయాలను అందుకున్నాయి. కాగా టాలీవుడ్ లో ఇప్పటి వరకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో వచ్చి సక్సెస్ ను అందుకున్న సినిమాలను చూద్దాం పదండి.

నక్సలిజం బ్యాక్ డ్రాప్ అనగానే ముందుగా గుర్తొచ్చేది. సింధూరం సినిమానే. ఈ మూవీ అప్పట్లో ఒక ప్రభంజనం. బ్రహ్మాజీ రవితేజ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ డైరెక్షన్ లో సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.  

నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలలో వచ్చిన సినిమా 'అప్పట్లో ఒకడుండేవాడు'. సాగర్ కె.చంద్ర డైరెక్షన్ లో  రూపుదిద్దుకున్న ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోనే వచ్చిందే. కాగా ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాన్ని అందుకుంది. ఇద్దరు హీరోలకు మంచి గుర్తింపు లభించింది. ఘన విజయం అని చెప్పలేం కానీ ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది.

శర్వానంద్, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో  నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన గమ్యం సినిమా కూడా చాలా మంచి సక్సెస్ ను అందుకుంది.  క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది. వసూళ్లను కూడా బాగా రాబట్టింది.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర  సినిమా కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంది. అయితే ఈ సినిమా మొదటి పార్ట్ మంచి విజయం సాధించగా పార్ట్ 2 ఫెయిల్ అయ్యింది.  ఇక తాజాగా నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కిన మూవీ విరాటపర్వం.  వేణు ఊడుగుల డైరెక్షన్ లో సాయి పల్లవి, రానా లు జంటగా తెరకెక్కిన ఈ మూవీ  ప్రేక్షకుల ఆదరణ పొందుతూ పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది.

ఇలా పలు సినిమాలు ఒకే నేపథ్యంతో వచ్చి సక్సెస్ ను అందుకున్నాయి. ఇకపై మరిన్ని సినిమాలు నక్సలిజం పై వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: