టాలీవుడ్ కుర్ర హీరోయిన్ రష్మికకు అవకాశాలు ఒక రేంజులో వస్తున్నాయి.ఇక ఇంతలోనే మరో జాక్ పాట్ పట్టిందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ని హీటెక్కిస్తోంది. ఈ భామ తన కెరీర్ లో తొలిసారిగా ఖాన్ సరసన అదిరిపోయే ఆఫర్ దక్కించుకుంది. అది కూడా సల్మాన్ భాయ్ సరసన క్రేజీ సినిమాలో నటించనుందని అనేక కథనాలొస్తున్నాయి.సల్మాన్ ఖాన్ మూవీ 'నో ఎంట్రీ 2' సినిమాలో 10 మంది హీరోయిన్లు ఉంటారని ఇంతకుముందే కథనాలొచ్చాయి. దక్షిణ భారత దేశంలోని క్రేజీ హీరోయిన్స్ పైనా సల్మాన్ భాయ్ కన్నేసారని గుసగుస బాగా వినిపిస్తోంది. టైగర్ 3 తర్వాత నో ఎంట్రీ 2 సినిమా సెట్స్ కి వెళుతుంది. ఈ హిట్ మూవీ సీక్వెల్ లో అనిల్ కపూర్ ఇంకా ఫర్దీన్ ఖాన్ లు కూడా నటిస్తారు.ఇక ఆసక్తికరంగా నో ఎంట్రీ 2లో సల్మాన్ సహా హీరోలంతా త్రిపాత్రల్లో కనిపించడం పెద్ద ట్విస్ట్.దీంతో ఏకంగా పది మంది నాయికలు అవసరమని ఇంతకుముందే అనేక కథనాలొచ్చాయి. ఇక ఇటీవల దక్షిణ భారత అగ్ర నటీమణుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.


ఇక రష్మిక మందన్న సహా సమంతా రూత్ ప్రభు.. పూజా హెగ్డే  ఇంకా తమన్నా భాటియా లాంటి టాప్ హీరోయిన్లను 'నో ఎంట్రీ 2'కి ఎంపిక చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా అప్పీల్ ని తేవడం కోసం సల్మాన్ భాయ్ తెలివిగా ఇలా ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.పుష్ప సినిమా ఘనవిజయంతో రష్మిక మందన్న బాలీవుడ్ లో పాపులర్ ఫేస్ గా మారింది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా నటించి యూత్ గుండెల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా 'మిషన్ మజ్ను' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాలో తన నటనతో అందరినీ ఆకర్షించిన సమంత రూత్ ప్రభు దేశవ్యాప్తంగా బాగా పాపులరైంది. పూజా హెగ్డే -తమన్నా ఎలాగో బాలీవుడ్ లో బాగా తెలిసిన ముఖాలు.. అందుకే సల్మాన్ ఖాన్ సదరు భామల పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం తెలిసింది. అయితే ఇందులో ఫ్రెష్ ట్యాలెంట్ రష్మిక మందనకు ఛాన్స్ ఆల్మోస్ట్ ఖాయమైనట్టేనన్న గుసగుస ఇప్పుడు వేడెక్కిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: