గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా మరొక వారం రోజుల్లోనే విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా  నిర్వహిస్తుంది.  హీరో హీరోయిన్ ల తో పాటు దర్శకుడు కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ విధంగా ఈ ముగ్గురు కలిసి ఈ సినిమా యొక్క క్రేజ్ ను పెంచుతున్నారు.  ఇప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ నెలకొంది.

మాస్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగివున్న గోపీచంద్ కు చాలా రోజుల నుంచి సరైన హిట్ దక్కడం లేదు. ఆయన గత సినిమా సిటీ మార్ భారీ విజయాన్ని అందుకోలేక పోయిన కూడా పర్వాలేదనిపించుకునే విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే వేరే స్థాయిలో మంచి ఘన విజయం అందుకోవాలనే గోపీచంద్ అభిమానులు భావిస్తున్నారు. మరి కమర్షియల్ చిత్రాలను ఎంతో బాగా తెరకెక్కిస్తున్న దర్శకుడైన మారుతి ఈ చిత్రాన్ని ఏవిధంగా హిట్ చేస్తాడో అనేది చూడాలి. 

ఒకవైపు హీరోయిన్ రాశీ ఖన్నా కి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సినిమా పరిశ్రమలోకి వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ గా ఎదగలేక పోతుంది. దాంతో ఈమె టాప్ హీరోయిన్ గా ఎదగాలంటే ఈ సినిమా హిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకొని భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.  చిన్న సినిమాలతో తన కెరీర్ ను మొదలుపెట్టిన దర్శకుడు మారుతి ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు చేసే హీరో గా ఎదిగాదంటే నిజంగా అది అయన కృషి అనే చెప్పాలి. అయన వరుస సినిమాలు మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: