
కాగా ప్రస్తుతం ఇతను నటించిన కృష్ణా వృందా విహారి సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టాడు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ యంగ్ హీరో ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. తన అన్న గౌతమ్ పెళ్లి జరిగింది. గత రెండు రోజుల క్రితం గౌతమ్ నమ్రత గౌడ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి అమెరికాలో ఎంతో వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్ళికి మాత్రం అతి కొద్ది మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ పెళ్ళికి తన సొంత తమ్ముడు నాగశౌర్య గైర్హాజరు అయినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే నాగశౌర్య టీమ్ చెబుతున్న ప్రకారం ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఇంగ్లాండ్ లో ఉన్నాడట. అందుకే పెళ్ళికి రాలేదని తెలిసింది. అయితే పెళ్లి అనేది ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు కదా... మరి అన్న కోసం షూటింగ్ అంత ముఖ్యంగా అంటూ పలువురు నాగశౌర్యను ఆడేసుకుంటున్నాడు అని తెలుస్తోంది. ఇంకా కొందరు అయితే వీరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అందుకే రాలేదా అంటూ లేని పోనీ సందేహాలను వెళ్లబుచ్చుతున్నారు.