తెలుగు కన్నడ హిందీ ఒరియా భాషలలో అనేక టీవీ షోలు తెరకెక్కించిన టాలీవుడ్ నిర్మాత శోభు యార్లగడ్డ rk మీడియా బ్యానర్ పై బాహుబలి చిత్రాలను నిర్మించారు. ఇలాంటి బడా చిత్రాన్ని నిర్మించిన వెంటనే మరొక పెద్ద సినిమా చేయకుండా ఉమామహేశ్వర ఉద్యోగ వంటి చిన్న చిత్రాన్ని మాత్రమే నిర్మించారు. చివరిగా పెళ్లి సందD వంటి సినిమాని అందించారు. బాహుబలి వచ్చి దాదాపుగా ఏడేళ్లు అవుతున్న ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బుల్లితెర నుంచి సినిమాల ప్రొడక్షన్ లొకి రావడం గురించి కొన్ని విషయాలను తెలిపారు వాటి గురించి చూద్దాం.


బాహుబలి వంటి పెద్ద ప్రాజెక్ట్ చేసిన తర్వాత చిన్న సినిమాలు చేయడానికి కారణాలు చెబుతూ.. హడావిడిగా ఎక్కువ చిత్రాలు చేయడం తనకి ఇష్టం ఉండేదని స్క్రిప్ట్ మరియు డైరెక్టర్ కి ప్రాధాన్యత ఇస్తానని శోభు తెలిపారు. కొన్ని సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేయగా కరోనా కారణంగా అవి కుదరలేదు.. వచ్చే ఏడాది పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో రాబోతున్నట్లుగా తెలియజేశారు. ఇటీవల తెలుగు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేదు గడిచిన కొన్ని నెలలగా ప్రేక్షకులు అభిరుచులు మారిపోయాయి అని శోభు తెలిపారు.


సాలిడ్ కంటెంట్ ఉన్న ఆచార్య వంటి సినిమాలు ఓపెనింగ్స్ కూడా రావట్లేదు దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన కలుగుతున్నారు. ఇక అంతే కాకుండా బాలీవుడ్ పరిస్థితి కూడా మరి చాలా దారుణంగా పడిపోయింది. స్టార్ హీరోలు అయినటువంటి వారు కూడా జీరో ఓపెనింగ్స్ తెచ్చుకోవడం నిజంగా అందరినీ కలవర పెట్టుతోంది అంటూ తెలిపారు. వీకెండ్ తర్వాత వసూలు సాధించకపోవడం ఒకే కానీ కనీసం ఫస్ట్ వీకైన కలెక్షన్లు రాబట్టకపోవడంతో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అని తెలిపారు. ఇప్పట్లో RRR,KGF వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూలు చేశాయి చిన్న సినిమాలు అయినా జాతి రత్నాలు డీజే వంటి చిత్రాలు కూడా బాగానే ఆడాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: