ఈసంవత్సరం సంక్రాంతి ఒమైక్రాన్ వల్ల నష్టపోవడంతో వచ్చే సంవత్సరం సంక్రాంతి సీజన్ అయినా పూర్తిగా వినియోగించుకోవాలని ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దీనితో 6నెలలు తరువాత రాబోతున్న సంక్రాంతి సీజన్ కు ఇప్పటి నుంచే మన టాప్ హీరోలు తమ బెర్త్ లు రిజర్వ్ చేసుకుంటున్నారు.


వాస్తవానికి ఈసంవత్సరంలో రాబోతున్న దసరా దీపావళి సీజన్ ను పెద్దగా పట్టించుకోకుండా టాప్ హీరోలు వచ్చే ఏడాది రాబోయే సంక్రాంతి గురించి ఆలోచించడం వెనుక ఒక కారణం ఉంది అంటున్నారు. దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈపరిస్థితి ఫోర్త్ వేవ్ కు దారి తీస్తుంది అన్నసందేహాలు వస్తున్నాయి. అదే జరిగితే దసరా దీపావళి లలో ఉత్సాహం పెద్దగా ఉండకపోవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి.



దీనితో ఎందుకైనా మంచిదని ముందుగానే సంక్రాంతి రేస్ కు సినిమాలు ఫిక్స్ అవుతున్నాయి. ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ జనవరి 12న విడుదల అవుతుంటే చిరంజీవి బాబిల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ మూవీని జనవరి 14కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వంశీ పైడిపల్లి విజయ్ ల కాంబినేషన్ లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ‘వారసుడు’ మూవీని కూడ జనవరి 13కు ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఇప్పటికే వైష్ణవ్ తేజ్ నటిస్తున్న యాక్షన్ మూవీకి టాప్ హీరోల సినిమాలతో సంబంధం లేకుండా సంక్రాంతి రేసుకు ఫిక్స్ చేయడం మరింత షాకింగ్ గా మారింది. దీనితో రాబోతున్న సంక్రాంతి రేసుకు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడ ఏధైర్యంతో ఏకంగా ఇన్ని క్యూ కడుతున్నాయి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈపరిస్థితులు ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ కూడ ఏదోవిధంగా పూర్తిచేసి సంక్రాంతి రేస్ కు విడుదల చేస్తారు అని వస్తున్న వార్తలు మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దీనితో రాబోతున్న సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎన్ని డ్రాప్ అయ్యే సినిమాలు ఎన్ని అన్నకోణంలో చర్చలు జరుగుతున్నాయి..  




మరింత సమాచారం తెలుసుకోండి: