విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ చిత్రం ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు ఐదు భాషలలో రాబోతుంది. తెలుగు హిందీ భాషలలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ మలయాళ కన్నడ భాషలలో సైతం విడుదల అవుతూ ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమా చాలా రోజుల తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో విడుదలవుతున్న అతి పెద్ద సినిమా కావడంతో అందరిలోనూ ఎన్నో ఆశలు ఉన్నాయి.

గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్నాయి. కారణమేదైనా కూడా మినిమమ్ కూడా ప్రేక్షకులను  అవి అలరించలేక ఫ్లాప్ మిగిలిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా పైనే అందరి దృష్టి ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో నటించిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధించి టాలీవుడ్ కి మరొక హిట్ సినిమా అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఏ విధమైన ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటించడం విశేషం. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యొక్క అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆదరించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అలాగే పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమాకు ఏ విధమైన స్పందన వస్తుందో చూడాలి. త్వరలోనే తెలుగు లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. ఎంతో మంది బాలీవుడ్ సెలేబ్రిటీలు ఈ సినిమా గురించి చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రం వారి అంచనాలను ఏ స్థాయి లో అలరిస్తాయో చూడాలి. ఈ సినిమా తో ఈ హీరో మాస్ ఇమేజ్ ను అందుకోవడం ఖాయం అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: