చెన్నైకి చెందిన ప్రముఖ బిజినెస్ మెన్, ఎన్నో కోట్లకు అధిపతి అయిన అరుళ్ శరవణన్‌ తన 51 ఏళ్ళ వయసులో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. 'ది లెజెండ్' అనే పాన్-ఇండియా చిత్రంతో అతను హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్ ఇంకా సుమన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా నటించారు. జూలై 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కూడా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ఇంకా అలాగే హిందీ భాషల్లో ఈ మూవీ చాలా గ్రాండ్‌ గా రిలీజ్ అయ్యింది.మొత్తం రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తనే నిర్మించుకున్నాడు శరవణన్. 'శ్రీ లక్ష్మీ మూవీస్' సంస్థ పై తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం జరిగింది.మొదటి నుండి అరుళ్ శరవణన్ లుక్స్ పై సోషల్ మీడియాలో ఇంకా తమిళ మీడియాలో చాలా ట్రోలింగ్ అనేది జరిగింది.


దీంతో ఈ సినిమా ట్రోల్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇక సినిమాకి ఎలాగూ నెగిటివ్ టాక్ వస్తుంది అని అందరూ కూడా ముందే ఊహించారు. అందుకు తగ్గట్టే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కనీసం మొదటి రోజు 25 శాతం కూడా ఈ మూవీ రికవరీ చేయలేదు. మరి రెండో రోజు సంగతేంటి అనే విషయం పై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.ఇక 'ది లెజెండ్' సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.5.64 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం తెలుస్తోంది.ఈ సినిమాని కేవలం అడ్వాన్స్ బేసిస్ మీదే విడుదల చేశారు. కాబట్టి పెట్టిన పెట్టుబడి మొత్తం రూ.80 కోట్ల బడ్జెట్ కూడా ఈ సినిమా రికవరీ చేయాలి.ఇంకా నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అయితే ఏమీ జరగలేదు. కాబట్టి ఈ సినిమా కనీస 10 శాతం కూడా రికవరీ చేయలేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: