గత కొన్ని సంవత్సరాలుగా నాని కెరియర్ సమస్యలలో పడింది. తాను నటించే ప్రతి సినిమా కథ చాల డిఫరెంట్ గా ఉండాలని నాని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతడు నటిస్తున్న సినిమాలు వరసగా ఫ్లాప్ లు అవ్వడంతో నాని టెన్షన్ లో ఉన్నట్లు టాక్. ఈమధ్యనే విడుదల అయిన ‘అంటే సుందరానికి’ మూవీలో నాని చాల కష్టపడి నటించినప్పటికీ అతడి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆమూవీ ఇవ్వలేక పోయింది.


దీనితో నాని ఆశలు అన్నీ దసరాకు విడుదల కాబోతున్న ‘దసరా’ మూవీ పై ఉన్నాయి. పక్కా మాస్ అవతారంతో నాని నటిస్తున్న ఈమూవీ సింగరేణి బొగ్గుగనుల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. నాని కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈమూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాని మార్కెట్ కు మించి ఈమూవీ బడ్జెట్ పెరిగిపోవడంతో ఈమూవీ నిర్మాతలు ఖంగారు పడుతున్నప్పుడు నాని వారికి ధైర్యం చెప్పి వారని అన్ని విధాల ప్రోత్సహించాడు అని టాక్.


సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అయిన తరువాత ఈమూవీ మరొక ‘పుష్ప’ తరహాలో ఉన్న మూవీనా అన్న సందేహాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి మరొక న్యూస్ సందడి చేస్తోంది. ఈమూవీ ఒక పక్కా లవ్ స్టోరీ అని అంటున్నారు. ఈసినిమాలో నాని ఒక స్లమ్ ఏరియాలో ఉండే మాస్ అబ్బాయిగా కనిపిస్తాడట.


కీర్తి సురేష్ ధనవంతుడు కూతురుగా కనిపిస్తుందట. వీరిద్దరి మధ్యా కొనసాగే ఇంటెన్స్ లవ్ డ్రామా హై వోల్టేజ్ లో ఉంటుందని అంటున్నారు. అయితే ఇలాంటి కథలకు సంబంధించిన సినిమాలు గతంలో చాల వచ్చాయి. దీనితో సగటు ప్రేక్షకుడు ఇప్పటికే అనేకసార్లు చూసిన కథను ‘దసరా’ మూవీలో చూపెదతారా అంటూ నాని అభిమానులు ఖంగారు పడుతున్నారు. అయితే ఈమూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా సుకుమార్ శిష్యుడు కాబట్టి ఏదో ఒక ట్విస్ట్ ఈమూవీలో ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: