తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్,కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బింబిసార. ఇక ఈ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమాకి వశిష్ఠ దర్శకత్వం వహించారు.ఇక  వశిష్ఠ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉండటంతో తన ఏజ్ హీరోలందరితో ఈయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే ఆ పరిచయంతో ముందుగా బింబిసార కథను ఓ స్టార్ హీరో కి చెప్పారట. ఆ హీరో ఓ భయం కారణంగా ఆ సినిమాని రిజెక్టు చేశారట. అయితే మరి ఆ హీరో ఎవరో?ఆ భయం ఏమిటో?ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన నందమూరి హీరోల అఖండ, ఆర్.ఆర్. ఆర్, తాజాగా బింబిసార సినిమాలు బిగ్గెస్ట్..

 హిట్ ని అందుకున్నాయి.ఇదిలావుంటే ఇక బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రేక్షకులలో మంచి హైప్ క్రియేట్ చేసింది.ఇక  దాంతో విడుదలైన తర్వాత కూడా పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.అయితే  అంతేకాక కొన్నిప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పూర్తి చేసుకుంది.ఇకపోతే  అఖండ, ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉన్న విధంగానే బింబిసార సినిమా లో కూడా పాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఇక అంతేగాక ఈ సినిమాకి పాప సెంటిమెంట్ ప్లస్ అయిందని చెబుతున్నారు.కాగా  ఈ సినిమాకి కొత్త దర్శకుడు వశిష్ఠ కి సినీ ప్రముఖుల నుండి..

 ప్రశంసల జల్లు వెల్లువత్తుతోంది .పోతే  సాధారణంగా ఒక కథని వేరే హీరోలకు చెప్పడం అనేది కామన్. ఇక ఈ సినిమా కథను కూడా ముందుగా వేరే హీరో కి చెబితే రిస్కు వద్దని ఆ హీరో రిజెక్ట్ చేశాడట.అయితే ఈ సినిమా కథని ముందుగా వశిష్ట రవితేజకు చెప్పాడని తెలుస్తోంది.ఇక  రవితేజ కు వశిష్ట కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.అయితే అందుకే ఈ కథపై వీరిద్దరూ కొన్ని రోజులు చర్చలు జరిపారట.  ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే ఓ చిన్న పాపను చంపే పాత్ర ఉండడం రవితేజకు నచ్చలేదు.పోతే  దాంతోపాటు డైరెక్టర్ కొత్త కాబట్టి ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాని హ్యాండిల్ చేస్తాడో లేడో అనే విషయంలో కొంచెం భయపడ్డాడట. ఇక ఈ కారణంతోనే రవితేజ సినిమా ని రిజెక్ట్ చేసాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కి ఈ సినిమాని చెప్పాడు డైరెక్టర్. డైరెక్టర్ మీద నమ్మకం ఉంచి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ఒప్పుకున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: