టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసిన దిల్ రాజ్ కు ప్రభాస్ తో మూవీ చేయాలని ఎప్పటినుండో తీరని కోరిక. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన తరువాత దిల్ రాజ్ కు ఈకోరిక మరింత పెరిగింది. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమధ్య దిల్ రాజ్ ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ ను కలిసి ప్రభాస్ కు సరిపడే ఒక భారీ ప్రాజెక్ట్ ఏమైనా మురగదాస్ మనసులో ఉందా అన్నకోణంలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.


మురగాదాస్ కు కూడ ప్రభాస్ తో సినిమా చేయాలని కోరిక ఏనాటి నుండో ఉంది. దీనితో వచ్చే ఏడాది దీనికి సంబంధించిన ఒక ప్రకటన వచ్చే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా దిల్ రాజ్ దృష్టి బాలయ్య పై కూడ పడింది అంటున్నారు. దర్శకుడు అనీల్ రావిపూడికి దిల్ రాజ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది ఈసాన్నిహిత్యంతోనే దిల్ రాజ్ తన కోరిక బాలయ్య విషయంలో నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం అనీల్ రావిపూడి బాలకృష్ణతో చేయబోయే మూవీ స్క్రిప్ట్ ను ఇంచుమించు ఫైనల్ చేసాడు. ఈమూవీలో బాలయ్య 50 సంవత్సరాల మధ్య వయస్కుడుగా కనిపించబోతూ ఉంటే అతని కూతురుగా శ్రీలీల నటించబోతోంది. ఈమూవీ స్ప్రిప్ట్ చాల డిఫరెంట్ అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య మ్యానియా బయ్యర్లలో బాగా ఉంది.


ఇలాంటి పరిస్థితులలో బాలకృష్ణ అనీల్ రావిపూడి మూవీ ప్రాజెక్ట్ ను కూడ తనవైపు తిప్పుకుంటే మంచి లాభాలు వస్తాయని దిల్ రాజ్ భావన. అయితే ఈమూవీకి నిర్మాతలుగా సాహు గారపాటి హరీష్ పెద్ది వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు దిల్ రాజ్ కూడ సహనిర్మాతగా కలవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఎందుకో ఆప్రయత్నాలు ముందుకు సాగడం లేదు అంటున్నారు. అయితే ఈమూవీ దర్శకుడు అనీల్ రావిపూడి కాబట్టి అతడి ద్వారా రాయబారాలు చేస్తూ దిల్ రాజ్ బాలయ్య మూవీని కూడ తన కాంపౌండ్ లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: