టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకరు ఆయన సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాలు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగి ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కించు కుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కూడా కొత్తగా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉన్న సత్యదేవ్ ,  తమన్నా కలిసి గుర్తుందా శీతాకాలం అనే మూవీ లో హీరో , హీరోయిన్ లుగా నటించిన విషయం మనకు తెలిసిందే . 

ఈ సినిమాని భావన రవి , నాగ శేఖర్, రామారావు చింతపల్లి , ఎం ఎస్ రెడ్డి, చిన్నబాబు నిర్మించారు . లవ్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయి చాలా కాలం అవుతుంది. కాక పోతే ఈ మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమా విడుదల తేదీని ఇన్ని రోజుల పాటు ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా గుర్తుందా శీతాకాలం మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. ఈ మూవీ ని నుంచి సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తాజాగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ మూవీ లో సత్యదేవ్ మరియు తమన్నా మొట్ట మొదటి సారి కలిసి నటిస్తున్నారు. మరి ఈ మూవీ ఈ ఇద్దరికీ ఎలాంటి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: