తెలుగు బుల్లితెర పై జబర్దస్త్ షో కి ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా క్రమం తప్పకుండా జబర్దస్త్ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉండే సాదాసీదా కామెడీ కంటే ఇక జబర్దస్త్ షో లో ప్రతి వారం కూడా సరికొత్త కామెడీ చూసి ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ఎంతోమంది జబర్దస్త్ చూసి కాసేపు హాయిగా మనసారా నవ్వుకుని ఉపశమనం పొందుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఇటీవల కాలంలో జబర్దస్త్ కార్యక్రమం కేవలం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాదు ఎంతో మంది అప్కమింగ్ కమెడియన్స్ కి లైఫ్ ఇస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయమయ్యారు. బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితులు గా మారిపోయారు. తమదైన  కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్విస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలికాలంలో జబర్దస్త్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రవీణ్. పటాస్ అనే కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత జబర్దస్త్లో అవకాశం దక్కించుకుని తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం కూడా అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 కాగా జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది అన్నది తెలుస్తుంది. గత కొంత కాలం నుంచి ఆరోగ్య సమస్యలతో  బాధపడుతున్న ప్రవీణ్ తండ్రి కన్నుమూసాడట. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు అన్నది తెలుస్తుంది  అయితే వెన్నుపూసలో నీరు వచ్చింది అని చెప్పిన డాక్టర్ లు తీయడానికి ప్రయత్నించగా ఆయన కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయ్. దీంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చివరికి మృతి చెందాడట. కాగా ప్రవీణ్ తల్లి చిన్నప్పుడే చనిపోయిందని ఇప్పటికే ప్రవీణ్ ఎన్నో సార్లు చెప్పాడు. ఇప్పుడు  తండ్రి కూడా చనిపోవడంతో ప్రవీణ్ శోకసంద్రంలో మునిగిపోయాడు. అయితే తల్లి చనిపోయినప్పటికీ మరో పెళ్లి చేసుకోకుండా ప్రవీణ్ ని అన్ని తానై చూసుకున్నాడు అతని తండ్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: