నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 మూవీ తెరకెక్కిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ ఆగస్ట్ 13 వ తేదీన మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది . ఈ మూవీ ప్రేక్షకులకు అంచనాలను అందుకునే విధంగా అద్భుతం గా ఉండడం తో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుత మైన టాక్ వచ్చింది . దానితో ప్రస్తుతం కార్తికేయ 2 మూవీ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతూ బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకు పోతోంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .

అసలు విషయం లోకి వెళితే ...  కార్తికేయ 2 మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన జీ 5 'ఓ టి టి' సంస్థ వారు దక్కించుకున్నట్లు , థియేటర్ రన్ 50 రోజులు ముగిసిన తరువాత ఈ మూవీ ని జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి . ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి ,  వైవా హర్ష ముఖ్యమైన పాత్రలలో నటించగా ,  కాలభైరవ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు . కాలభైరవమూవీ కి అందించిన సంగీతాని కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: