ఏ
సినిమా పరిశ్రమలో అయినా హీరోయిన్లకు
సక్సెస్ ఉంటేనే వారికి మరిన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. అలా సినిమాలతో
సక్సెస్ లేకపోతే సదరు
హీరోయిన్ కు గడ్డు రోజులు మొదలైనట్లే అని చెప్పాలి. ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న
హీరోయిన్ కృతి శెట్టి ఇప్పుడు వరుస ప్లాపులను అందుకోవడం ఆమె కెరియర్ పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అని కొంతమంది
సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.
తొలి చిత్రంతోనే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే మోస్ట్
వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అందుకే ఆమెను తమ సినిమాలలో పెట్టుకోవడానికి హీరోలు అందరూ కూడా ఎంతగానో ఆసక్తి చూపించారు. దానికి తోడు ఆమె నటించిన సినిమాలు వరుసగా సూపర్ హిట్ అవడం కూడా ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టడానికి కారణం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా నటిస్తున్న సినిమాలు వరుసగా రెండు ఫ్లాప్ అవడం ఆమెను కిందకు లాగుతున్నాయని చెప్పాలి.
మొదట్లో ఆమెను లక్కీ హీరోయిన్గా పేర్కొన్న వారే ఇప్పుడు ఆమెను దూరంగా ఉంచడం జరుగుతుంది దాంతో ఈమె కెరియర్ ఏమవుతుందో అన్న అయోమయంలో ఆమె అభిమానులు ఉన్నారు మంచి అభినయం డ్యాన్సులతో పాటలతో ఇరగదీస్తున్న ఈ ముద్దుగుమ్మకు
సక్సెస్ తోడైతే బాగుంటుంది అనేది వారి ఆలోచన. ప్రస్తుతం ఆమె చేస్తున్న కొన్ని సినిమాల పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది
రామ్ తో చేసిన ది
వారియర్ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకర్షించకపోవడం అందులో ఈమె పాత్ర బాగానే ఉన్నా కూడా
సినిమా సూపర్ హిట్ కాకపోవడం ఈ విధమైన వార్తలు ఆమెపై రావడానికి కారణం అవుతుంది. మరి ఇప్పుడు చేయబోయే సినిమాలతో ఆమె మళ్ళీ ఫాం లో కి వచ్చి విజయాలను అందుకుంటుందా అనేది చూడాలి.