తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి , సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా , ఇంద్రగంటి మోహనకృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది వరకే సుదీర్ బాబు మరియు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో సమ్మోహనం మరియు వి మూవీ లు తెరకెక్కియి. 

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన తేదీని మరియు వేదికను ఖరారు చేసింది.

మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 13 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి కన్వెన్షన్స్ ,  ఫిలిం నగర్ , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: