తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఛలో మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న నాగ శౌర్య ఆ తర్వాత అశ్వద్ధామ వంటి విజయవంతమైన మూవీ తో తన క్రేజ్ ని మరింత గా పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో కృష్ణ వ్రింద విహారి అనే మూవీ లో హీరోగా నటించాడు. యువ దర్శకుడు అనీష్ కృష్ణమూవీ కి దర్శకత్వం వహించగా ,  ఈ మూవీ లో నాగ శౌర్య సరసన షిర్లే సెటియా హీరోయిన్ గా నటించింది. 

మూవీ రేపు అనగా సెప్టెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది.

మూవీ 2 గంటల 19 నిమిషాల సాధారణ నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం లక్ష్య మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన నాగ శౌర్య 'కృష్ణ వ్రింద విహారి' మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి. ఇప్పటికే కృష్ణ వ్రింద విహారి మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: