ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలను చేసే హీరోలు దర్శకుల జాబి తా రోజు రోజుకు ఎక్కువ అయిపోతుంది. పెద్ద హీరోలు మాత్రమే ఈ విధమైన సినిమాలను చేసేవారు. వారికి అత్యధికంగా మార్కెట్ ఉంటుంది కాబట్టి, దేశవ్యాప్తంగా వారు చేసే సినిమా లకు మంచి క్రేజ్ ఉంటుంది కాబట్టి వారు ఆ సినిమాలను చేస్తూ ఉంటారు. నేషనల్ వైడ్ గా ఒక సినిమాను ప్రేక్షకులందరికీ మెప్పించేలా చేయడం అంటే అంత సామాన్యమైన విషయమేమీ కాదు. పెద్ద దర్శకులకు మాత్రమే ఇది సాధ్యపడుతూ ఉంటుంది.

కేజిఎఫ్ బాహుబలి వంటి సినిమాలు ఈ విధమైన మంచి ఫలితాలను ఈ విషయం లో అందుకోగా ఇప్పుడు మరొక మీడియం స్థాయిలో సినిమాలను చేసే దర్శకుడు ఈ పాన్ ఇండియా సినిమా వైపు అడుగులు వేయడం విశేషం. ఇప్పటికే కొంతమంది చిన్న హీరోలు చిన్నదర్శకు లు పాన్ ఇండియా సినిమాలను చేయడానికి పూనుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడైన హను రాఘవపూడి ఈ పాన్ ఇండియా సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట. 

మొదటి నుంచి ప్రేమ కథ సినిమాలను ఎంతో అద్భుతంగా తెరపైన ఆవిష్కరించే ఈ దర్శకుడు జయా పజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ హీరోగా సీతారామం అనే సినిమాను చేసిన హను రాఘవపూడి ఇప్పుడు తన తదుపరి సినిమాగా ఓ పాన్ ఇండియా సినిమాను ఓ క్రేజీ హీరోతో చేయడానికి ప్లాన్ చేశాడట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. మరి ఇప్పటికే హిందీలో సీతారామం సినిమా తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు అక్కడి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా ఈ పాన్ ఇండియా సినిమాను చేసి మళ్లీ ఘన విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: