కొద్ది రోజులుగా తెలుగు ఇండస్ట్రీ వర్గాల లో, సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతూ.. పాపులర్ అయిన పేరు చంద్రహాస్. 22 ఏళ్ళ ఈ కుర్రాడు ఎవరో అందరికి తెలిసే ఉంటుంది.
బుల్లితెర ప్రముఖ నటుడు, సినీ దర్శకుడు ప్రభాకర్ తనయుడే ఈ చంద్రహాస్. త్వరలో ఇండస్ట్రీలోకి హీరో గా డెబ్యూ చేయబోతున్నాడు. అయితే.. ఇటీవల మొదటి సినిమా అనౌన్స్ మెంట్ లోనే ఏకంగా మూడు సినిమాలు అనౌన్స్ చేసి వార్తల్లోకెక్కిన చంద్రహాస్.. ఒక్క ప్రెస్ మీట్ తోనే సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయాడు.

డెబ్యూ హీరోల కు ఉండాల్సిన కటౌట్, లక్షణాలు ఉన్నాయా? అనే విషయం పక్కన పెడితే.. డెబ్యూ హీరోకి కావాల్సినంత సోషల్ మీడియా ట్రోలింగ్, క్రేజ్ మాత్రం బాగా సంపాదించుకున్నాడు. ప్రెస్ మీట్ లో బర్త్ కేక్ కట్ చేసిన చంద్రహాస్.. ఆ మీట్ లో పేరెంట్స్ మాటలు కూడా పట్టించు కోకుండా యాటిట్యూడ్ ద్వారా హాట్ టాపిక్ గా మారాడని అంటున్నారు. చంద్రహాస్ జేబు లో చేతులు పెట్టుకుంటూ, నిలకడగా ఉండ కుండా యాటిట్యూడ్ చూపిస్తున్నాడనే విమర్శలు కూడా చాలా వచ్చాయి. అయితే.. కొడుకుపై వచ్చిన ట్రోల్స్ పై ప్రభాకర్ కూడా స్పందించారు.

చంద్రహాస్ ఇంకా చిన్నవాడేనని, మున్ముందు మీడియా తో.. అభిమానులతో ఎలా ఉండాలో నేర్చుకుంటాడని చెప్పాడు ప్రభాకర్. అలాగే ప్రస్తుతం చంద్రహాస్ నిలబడే పద్ధతి నచ్చలేదేమో గాని, రేపు అతని యాక్టింగ్ స్కిల్స్ నచ్చితే విమర్శించినవారే ఆదరిస్తారనే నమ్మకాన్ని బయటపెట్టడం విశేషం. ఇదిలా ఉండగా.. ప్రభాకర్, తనయుడు చంద్రహాస్ ఇద్దరూ కలిసి ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ టీ20 మ్యాచ్ లో సందడి చేశారు. మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను ప్రభాకర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి ఈ చంద్రహాస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: