దర్శకుడి గా ,  నటుడి గా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి అద్భుతమైన దర్శకుడు గా గుర్తింపు ను సంపాదించుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో , ఎన్నో పాత్రలలో నటించి తన నటన తో కూడా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిం చుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన సీతా రామం అనే మూవీ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. అలాగే తాజాగా విడుదల అయిన ది లైఫ్ ఆఫ్ ముత్తు అనే మూవీ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో దగ్గర విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది.

ది లైఫ్ ఆఫ్ ముత్తు మూవీ లో శింబు హీరో గా నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా నయనతార హీరోయిన్ గా ఒక మూవీ తెరకెక్కుతుంది. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇప్పటి వరకు నన్ను మూవీ మేకర్స్ సంప్రదించలేదు అని ,  ఒక వేళ సంప్రదించినట్లు అయితే కచ్చితంగా ఒప్పుకుంటాను అని నాకు ప్రతి నాయకుడి పాత్రలో నటించడం అంటే చాలా ఇష్టం అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: