టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఇక మెగాస్టార్ చిరంజీవికి కొంచెం తొందర ఎక్కువ.ఈయన ఏ సినిమా వేడుకలో అయినా సరే ఆయన 15 నుండి 30 నిమిషాల వరకు మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు అందరినీ చూసిన ఆనందంలోనో లేక అభిమానుల కేరింతలకో కానీ ఉత్సాహంలో ఆయన..ఆయా సినిమాలకు సంబంధించిన కీలక అంశాలను బయట పెట్టేస్తూ ఉంటారు.ఇకపోతే 'రంగస్థలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

 ఆది పాత్ర చనిపోతుంది అన్న విషయాన్ని ఆయన బయటపెట్టేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అటు తర్వాత 'ఆచార్య' అనే టైటిల్ ను లీక్ చేయడంలో కానీ,మెహర్ రమేష్ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రాకముందే 'బిగ్ బాస్ 4' ఫినాలేకి వెళ్ళినప్పుడు అక్కడ బయటపెట్టేయడం వంటివి మనం చూశాం. ఇక ఇలా లీక్ లు చేయడం గురించి మెగాస్టారే తనపై తాను పలుమార్లు సెటైర్లు వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే  ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.అయితే ఈ సందర్భంగా అనంతపురంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చారు.ఇక ఇందులో భాగంగా ఓ పక్క చిత్ర బృందంని పొగుడుతూనే ఈ చిత్రంలో కట్టప్ప లాంటి పాత్ర గురించి బయటపెట్టేశారు.అయితే అలాంటి పాత్రని ఈ చిత్రంలో పోషించింది సునీల్.ఇకపోతే అతని పాత్ర చాలా మిస్టీరియస్ అని చెప్పడంతో ఒరిజినల్ చూసిన వారికి ఆ పాత్ర పై క్లారిటీ వచ్చేసింది. ఇక ' 'గాడ్ ఫాదర్' లో చిరు పోషిస్తున్న బ్రహ్మ అనే పాత్రని అరెస్ట్ చేయించి వెన్నుపోటు పొడిచేది సునీల్ అని అందరికీ క్లారిటీ ఇచ్చేసినట్టు అయ్యింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: