బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్షయ్ కుమార్ ఇప్పటివరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ హీరో తాను నటించిన హిందీ మూవీ ల ద్వారానే తెలుగు లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. 

ఆనంద్ ఎల్ రాయి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో ఆకట్టుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సాధించిన రక్షా బంధన్ మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. రక్షా బంధన్ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన  జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ 5 'ఓ టి టి' సంస్థ తాజాగా ప్రకటించింది. ఎవరైనా రక్షా బంధన్ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే అక్టోబర్ 5 వ తేదీ నుండి ఈ మూవీ జీ 5 'ఓ టి టి' ఫాల్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: