తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మూవీ లో చిరంజీవి హీరోగా నటించిన మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ,  టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రామిసింగ్ నటుడుగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. గాడ్ ఫాదర్ మూవీ లో చిరంజీవి హీరోగా నటించిన సల్మాన్ ఖాన్ ,  సత్యదేవ్ ,  నయన తార లాంటి గొప్ప నటులు ఇతర ముఖ్య పాత్రలలో నటించడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ ప్రమోషన్ లలో భాగంగా చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ కోసం సల్మాన్ ఖాన్ తీసుకున్న రెమ్యూనిరేషన్ గురించి చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ 'గాడ్ ఫాదర్' మూవీ కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోలేదు అని చిరంజీవి తాజాగా చెప్పుకొచ్చాడు. దానితో చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ ల మధ్య ఉన్న స్నేహం ఏ రేంజ్ దో మనకు అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: