గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా లోనే గొప్ప దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మణిరత్నం "పొన్నియన్ సెల్వన్" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన భారీ ఎత్తున తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ ,  హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. అలాగే ఈ మూవీ కి ఇటు ప్రేక్షకుల నుండి ... అటు విమర్శకుల నుండి కూడా అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా పొన్నియన్ సెల్వన్ మూవీ కి దర్శకత్వం వహించిన మణిరత్నం ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఎంతో మంది కి చేరువ కావడంతో ఈ మూవీ ని తీయాలి అనుకున్నాను.  

1994 వ సంవత్సరంలో మరియు 2011 వ సంవత్సరంలో ఈ మూవీ ని తీయాలి అని ,  కొన్ని కారణాలతో అపివేశం.  ఈ మూవీ ని ఆలస్యంగా తీయడం చాలా మంచిది అయింది ,,  అప్పటికి ఇప్పటికీ సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందింది అని మణిరత్నం తాజాగా చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే పోనియన్ సెల్వన్ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాల ముఖ్య పాత్రలో నటించగా , ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: