తన సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇంటర్వూస్ ఇస్తున్న సమయం లో యాంకర్ గా పరిచయమైనా 'ఫాతిమా' అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు విజయ్ ఆంటోనీ..కోలీవుడ్ లో ఈ జంట మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు కూడా తెచ్చుకుంది..ఒకరి కోసం ఒకరు పుట్టారు అనేంతలా అనిపించే ఈ జంట ఈ మధ్య ఇటీవల కాలం లో గొడవలు ఏర్పడ్డాయని..ఆ గొడవలు విడాకులు వరుకు దారి తీసిందని కోలీవుడ్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది..అయితే ఇలాంటి రూమర్స్ సెలెబ్రిటీల నుండి రావడం సహజమే కదా అని మనం అనుకోవచ్చు.
కానీ లేటెస్ట్ గా విజయ్ ఆంటోనీ పెట్టిన ఒక పోస్టు ఈ రూమర్స్ నిజమేనేమో అని నమ్మేలా చేస్తుంది..'ఇద్దరి మధ్య సమస్య ఉంటె దానిని పరిష్కరించడానికి ఎప్పుడు కూడా మూడవ వ్యక్తిని మీ జీవితం లోకి రానివ్వొద్దు..దాని వల్ల మీ జీవితాలు చాలా మారిపోతాయి..జాగ్రత్తగా ఉండండి' అంటూ విజయ్ ఆంటోనీ పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది మరి ..ఈ పోస్టుని గమనిస్తే జీవితం లో ఆయనకీ ఎదురైనా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అభిమానులతో పంచుకున్నట్టు తెలుస్తుంది..తన భార్య తో విడాకులు అవ్వబోతుంది అనే వార్తకి బలం చేకూరుస్తుంది..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ, అబద్ధం ఉందో రాబొయ్యే కాలం లో మనకి తెలుస్తుంది అని ఆశిస్తున్నాము
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి