సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన "పుష్ప ది రైజ్ " సినిమా భారీ అంచనాల మధ్య ఐదు భాషల్లో గత ఏడాది డిసెంబర్ లో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. ఫస్ట్ పార్ట్ అనూహ్యంగా సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గా 'పుష్ప : ది రూల్' ని చేయబోతున్న విషయం తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ కావడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న తీమ్ ఈ మూవీని దీపావళి తరువాత సెట్స్ పైకి తీసుకెళ్లబోతోంది.ఫస్ట్ పార్ట్ రికార్డు స్థాయి విజయాన్ని సాధించడంతో 'పుష్ప 2' ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని భారీ బడ్జెట్ ని కూడా కేటాయించారు. రూ. 350 కోట్లకు మించి ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేయబోతున్నారట.'పుష్ప'ని ముందు రెండు భాగాలుగా తెరపైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేయలేదు. అయితే చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకుని రెండు భాగాలుగా చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే దీన్ని రెండు భాగాలతో ఎండ్ చేయాలనే ఉద్దేశం సుకుమార్ కు ఆయన టీమ్ కు లేదని తెలుస్తోంది.


పార్ట్ 2 ఎండింగ్ లో మరో భాగానికి లీడ్ ని వదలాలని సుకుమార్ ఆయన టీమ్ ప్లాన్ చేస్తున్నారట.రీసెంట్ గా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 'కేజీఎఫ్ 2' క్రేజ్ కారణంగానే 'పుష్ప' టీమ్ ఆ సినిమాని ఫాలో అయ్యి సీక్వెల్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తోందని సమాచారం తెలుస్తుంది.అయితే పార్ట్ 3 కి లీడ్ ఇచ్చే సీన్ కోసం ఇప్పడు కసరత్తు మొదలైందని అది సెట్టయితే 'కేజీఎఫ్ 3' సినిమా లాగే 'పుష్ప 3' ని కూడా తెరపైకి తీసుకొస్తారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైనల్ క్లైమాక్స్ సీన్ కోసం డైరెక్టర్ సుకుమార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. 1000 కోట్ల టార్గెట్ గా పుష్ప 2 సినిమా చాలా జాగ్రత్తగా తెరకెక్కుతుంది.మరి చూడాలి పుష్ప 2 అంత వసూలు చేస్తుందో అంత కన్నా ఎక్కువ వసూలు చేస్తుందో లేదా అంతకన్నా తక్కువ వసూలు చేస్తుందో అసలు ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో రిలీజ్ అయ్యాక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: