టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మరొక ఏడాది దాదాపుగా పూర్తయింది అని చెప్పాలి. ఈ ఏడాది పూర్తవడానికి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ రెండు నెలలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు చాలా తక్కువ క్రేజ్ ను కలిగి ఉన్నాయి. భారీ సినిమాలు పెద్ద హీరోల సినిమాలు ఈ ఏడాది కొన్ని రిలీజ్ అయిన కూడా వచ్చే ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ విధంగా వచ్చే ఏడాది విడుదల కాబోతున్న అగ్ర హీరోల సినిమాలను ఒకసారి పరిశీలిద్దాం.

సంక్రాంతి కానుకగా మూడు భారీ బడ్జెట్ అగ్ర హీరోల సినిమాలు విడుదల అవడానికి సిద్ధమవుతు న్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధమవుతూ ఉండగా అదే సమయంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాని కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ కూడా సంక్రాంతికి విడుదల కాబోతోంది.

ఆ విధంగా ఏడాది ఆరంభంలోనే మూడు భారీ సినిమాలు విడుదలకు నోచుకుంటున్నాయి. ఇది సిని మా ప్రియులకు ఎంత గానో ఆనందపరిచే విషయం అనే చెప్పాలి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా ఫిబ్రవరిలో విడుదల అవుతుందన్న వార్తలు ఇప్పుడు ఎక్కు వగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాను కూడా వచ్చేయడాది విడుదల చేస్తూ ఉండడం విశేషం. ఇక ప్రభాస్ నటించిన మారుతి సినిమాను కూడా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నాడు. శంకర్ రామ్ చరణ్ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతుంది. త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాని కూడా వేసవిలోనే విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: