ఇంత జరుగుతున్నా కొరటాల తన మౌనాన్ని వీడకుండా సహనం కొనసాగిస్తూ జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభించవలసిన సినిమా స్క్రిప్ట్ పై తన పూర్తి దృష్టి పెడుతూ వచ్చాడు. ‘ఆచార్య’ ఫ్లాప్ కావడంతో జూనియర్ కు కూడ కొన్ని భయాలు ఏర్పడటంతో కొరటాల తనకు చెప్పిన కథలో అనేక మార్పులుచేర్పులు చేయించాడు అన్నప్రచారం కూడ జరిగింది.
ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగి జూనియర్ తో తీయబోయే మూవీ స్క్రిప్ట్ కూడ ఫైనల్ కావడంతో ఈమూవీని దీపావళి తరువాత ప్రారంభించడానికి కొరటాల అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కొరటాలకు ‘ఆర్ ఆర్ ఆర్’ అడ్డు తగులుతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. దీనికికారణం రాజమౌళితో కలిసి జూనియర్ జపాన్ లోని టోక్యో పట్టణంలో జరగబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ జపనీస్ వెర్షన్ ప్రీమియర్ షోకు వెళ్ళడమే కాకుండా అక్కడ నుండి జూనియర్ చరణ్ తో కలిసి అమెరికా కూడ వెళ్ళబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఫారెన్ సాంగ్స్ కోటాలో నామినేషన్ పొందే అవకాశం ఉండటంతో ఈనామినేషన్ ఫలితంతేలే జనవరి 23 వరకు తారక్ చరణ్ రాజమౌళి లతో కలిసి అమెరికాలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ప్రమోట్ చేస్తూ అమెరికన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే ఆస్కారం ఉండటంతో కొరటాల జూనియర్ ల మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడినా ఆశ్చర్యంలేదు అంటూ జరుగుతున్న ప్రచారం ఒకవిధంగా కొరటాలకు షాక్ ఇచ్చే విషయం అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి