ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ వేదికగా ఈ టాక్ షో ప్రసారమవుతోందన్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ ను ఇటీవలే ప్రారంభించారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వచ్చి సందడి చేశారు. అయితే త్వరలో ఈ షోకి విక్టరీ వెంకటేష్ రానున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాళ్లోకి వెళితే..
డ్యాన్స్ లు, ఫైట్ లతో సినిమాలతో చెలరేగిపోతాడు నందమూరి నటసింహం బాలకృష్ణ డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు. సూపర్ సక్సెస్ అయిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'కు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ 'Unstoppable with NBK 2' షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14వ తేదీన స్ట్రీమింగ్ చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్టుగా వచ్చారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చి రికార్డు స్థాయిలో వీక్షణలు దక్కించుకుంది. ఆ తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ వచ్చి బాలయ్యతో ఆడిపాడారట..
సూపర్ సక్సెస్ గా సాగుతోన్న 'Unstoppable 2' టాక్ షోకి మూడో ఎపిసోడ్ లో యంగ్ అండ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ అడివి శేష్, శర్వానంద్ సందడి చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ''టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ తో దబిడి దిబిడి కొనసాగుతుంది'' అని పోస్ట్ చేసింది ఆహా. ఈ మూడో ఎపిసోడ్ నవంబర్ 4న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు తాజాగా ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. ఈ మూడు ఎపిసోడ్ తర్వాతి ఎపిసోడ్ లకు వచ్చే అతిథుల ఎవరా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
నందమూరి బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న ఈ 'Unstoppable 2' నాలుగు కానీ ఐదో ఎపిసోడ్ కు కాని ఫ్యామిలీ హీరో దగ్గుబాటి వెంకటేష్ హాజరు కానున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. దీంతో వెంకటేష్ ను బాలయ్య బాబును ఒకే వేదికపై చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారట. మరి దీంట్లో ఎంత నిజముందో చూడాలి. ఇదిలా ఉంటే Unstoppable 2 సీజన్‌లో పవన్ కల్యాణ్ పాల్గొనే ఎపిసోడ్ ఇప్పటికే ఖరారైందని ఆహా వర్గాలు తెలుపుతున్నాయి. అయితే పవన్ పాల్గొనే ఎపిసోడ్ తోనే ఈ సీజన్ ముగిస్తుందట. Unstoppable 2 సీజన్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ పాల్గొనే పవర్ ఎపిసోడ్ తో ముగుస్తుందనేది సినీ వర్గాల్లో జరుగుతోన్న ప్రచారం. అయితే ఈ విషయంపై పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదని మరో వార్త వినిపిస్తుంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి