మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా
శంకర్ దర్శకత్వంలో ఓ
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణయించిన ఈ
సినిమా యొక్క షూటింగ్ దాదాపుగా పూర్తయింది. చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి లో విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ చేయబోయే తదుపరి
సినిమా గురించి ఇప్పుడు అంతటా చర్చ వినిపిస్తుంది. చాలా మంది దర్శకులను పరిశీలిస్తున్న చరణ్ ఎవరితో ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడో ఎవరికీ తెలియడం లేదు.
దీని పట్ల మెగా అభిమానులు సైతం ఎంతో అయోమయంలో ఉన్నాడు. అయితే కొంతమంది మెగా అభిమానులు చరణ్ ఏ
సినిమా చేసిన కూడా అందులో
హీరోయిన్ గా
పూజ హెగ్డే నే పెట్టుకోవాలనే విధంగా సూచిస్తున్నారు. ప్రస్తుతం
టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో అగ్ర
హీరోయిన్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ చరణ్ తో కలిసి గతంలో నటించింది. కానీ సోలో
హీరోయిన్ గా నటించలేదు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో ఈ ముద్దుగుమ్మ
హీరోయిన్ గా నటించగా అందులో ఆమెది జస్ట్ గెస్ట్ పాత్ర అని చెప్పాలి.
ఈ నేపథ్యంలో ఈమెతో ఆయన కలిసి ఫుల్ సినిమాలో నటించాలని చెబుతున్నారు. అంతకు ముందు రంగస్థలం సినిమాలో ఐటెం భామగా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈ నేపథ్యం లో చరణ్ రాబోయే సినిమాలో ఈమె
హీరోయిన్ గా నటిస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలేవి లేని నేపథ్యంలో ఆమె చరణ్ తో నటించేందుకు పెద్దగా ఆలోచించదు అని చెబుతున్నారు. మరి మెగా అభిమానుల ఈ కోరిక తీరుతుందా అనేది చూడాలి. ఆమెతో సినిమాలు చేయడానికి
బాలీవుడ్ లోనే పోటీపడుతున్న నేపథ్యంలో చరణ్
సినిమా అవకాశం పెద్ద విశయమేమీ కాదేమో.