హీరోయిన్ సోనాల్ చౌహన్ నటించిన రెయిన్బో సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదట మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి పలు బ్రాండ్ అంబాసిడర్లకు బ్రాండ్ గా వ్యవహరించింది. ఇక బాలీవుడ్లో ఆ తర్వాత జన్నత్ అని హిందీ సినిమా ద్వారా మొదటిసారిగా బాలీవుడ్లోకి ప్రవేశించింది. ఇక తర్వాత బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీంతో పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ సోనాల్ ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్గా హోదాను అందుకోలేకపోయింది.

రీసెంట్గా సోనాల్ ది ఘోస్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రంలో హీరోగా నాగార్జున నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ చవిచూసింది. ఈ సినిమా మీద ఎంతో ఆశతో ఈ ముద్దుగుమ్మ తన అందాలను ప్రదర్శించిన అదంతా కేవలం నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు. ఇదంతా పక్కన పెడితే సోనాలి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
సిల్వర్ స్క్రీన్ మీద తగిన ఇమేజ్ను అందుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందంతో ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో తరచూ తన గ్లామర్ ఫోటోలతో అప్పుడప్పుడు రచ్చ చేస్తూ ఉంటుంది తాజాగా మరొకసారి తన అందాల విందుని ప్రదర్శించి కుర్రకారులను గుబులు రేపేలా చేస్తోంది. తాజాగా బ్రౌన్ కలర్ ప్యాంటు షర్ట్ టాప్ ధరించిన సోనాల్ చాలా అందంగా కనిపిస్తోంది ముఖ్యంగా తన నాభి అందాలను చూపిస్తూ కుర్రకారులను బాగా ఆకట్టుకునేలా చేస్తుంది సోనాల్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ చిత్రంలో సోనాలు ఒక కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: