మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ తన కెరీర్ లో ముకుంద , తొలిప్రేమ వంటి సున్నితమైన ప్రేమ కథ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ,  గద్దల కొండ గణేష్ వంటి పవర్ఫుల్ మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ ఈ సంవత్సరం ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.

వరుణ్ తేజ్ ఈ సంవత్సరం మొదట గని మూవీ తో ప్రేక్షకులను పలకరించగా , ఆ తర్వాత ఎఫ్ 3 మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లలో గని మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ ,  శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం డిసెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ మనిషా చిల్లర్ , వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించ బోతున్నట్లు , ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లోనే వెలువడనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: