రవితేజ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ ఇప్పుడు మూడవ సినిమా ద్వారా వారిని అలరించబోతున్నాడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేసిన ధమాకా సినిమాను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే రవితేజ చేయబోతున్న తదుపరి సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలు ఎప్పుడు అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది.

రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో చేసిన రావణాసుర సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పాలి. వెరైటీ కాన్సెప్ట్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో రవితేజ అభిమానులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని త్వరగా విడుదల చేయాలని కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకు రవితేజ ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన ఓ తేదీని కూడా ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించాలని దర్శక నిర్మాతలకు చెప్పాడట.

ఇక రవితేజ నటిస్తున్న మరొక చిత్రం టైగర్ నాగేశ్వరరావు. బయోపిక్ సినిమా గా రుపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తుంది అని అందరూ భావిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ విధంగా ఏడాదికి మూడు సినిమాలను చేసుకుంటూ పోతూ ఉండడం రవితేజ ఇతర హీరోలకు ఎంతో ఆదర్శంగా ఉంటుంది అని చెప్పాలి. ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయని నేపథ్యంలో అందరి హీరోలా కాకుండా ఈ విధంగా మూడు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మాస్ ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా ఉన్న రవితేజ తన క్వాలిటీని ఏమాత్రం కోల్పోకుండా ఇలాంటి సినిమాలను చేయడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: