సమంత ప్రధాన పాత్రలో రూపొందిన యశోద చిత్రం ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి ఫలితాన్ని అందుకుంది. అయితే వారాంతం తరువాత ఈ సినిమాకు ఆశించిన కలెక్షన్లు రాకపోవడం ఆ సినిమా బృందాన్ని ఎంతగానో నిరాశ పరుస్తుంది అని చెప్పాలి. టాక్ పరంగా ప్రజల నుంచి మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ ఈ సినిమాకు కలెక్షన్లు రాకపోవడం ఎవరికైనా నిరాశను కలిగించే విషయమ నే చెప్పాలి.

ప్రమోషన్ కార్యక్రమాలకు సమంత రాకపోయినా కూడా ఈ చిత్రానికి ఇంతటి స్థాయిలో గుర్తింపు రావడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. కమర్షియల్ హీరో లేని ఈ సినిమాలో ఇంత మంచి గుర్తింపు రావడం మంచి విషయం కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ గురించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సమంత ఒప్పుకుంటుందా అనేది ఇక్కడ ఆసక్తికరంగా ఉంది.

దర్శకులు ఈ సినిమాకు సంబంధించిన సీక్వల్ ను చేయడానికి సిద్ధంగా ఉన్నామని అయితే దానికి సమంత ఒప్పుకుంటుందో లేదో అన్న అనుమానాలను వారు వ్యక్తపరుస్తున్నారు. ఇంకొక వైపు చిత్ర నిర్మాతలు కూడా ఈ సినిమాను చేసే విధంగా ముందడుగులు వేస్తారా లేదా అనేదే ఇక్కడ అసలు విషయం. ఎందుకంటే మొదటి భాగానికి సంబంధించిన వసూలు ఎక్కువగా రావడం లేదు కమర్షియల్ హీరో లేని కారణంగానే ఈ విధంగా వసూలు రావడం లేదు అనేది వారికి అర్థమయింది. ఈ నేపథ్యంలో సమంత ను తీసుకొని మరొకసారి వీరు రిస్క్ చేస్తారా అనేదే అసలు విషయం.

ఏదేమైనా ఇలాంటి సినిమాలకు సీక్వెల్ చేయకపోవడం మంచిదని కొంతమంది చెబుతున్నారు ఓటిటీ ద్వారా శాటిలైట్ ద్వారా ఈ చిత్రానికి ఎంతో కొంత లాభాలు అయితే వస్తాయి ఒకవేళ రెండవ భాగం సినిమా మంచి టాక్ సంపాదించుకోకపోతే మాత్రం వసూళ్ల విషయంలో నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: